80% బిల్లులు మూజువాణి ఓటుతోనే పాసయ్యాయి

తెలంగాణకు వ్యతిరేఖంగా ముఖ్యమంత్రి ఆదివారం తన ప్రెస్ మీట్ ని కొనసాగించారు. కొందరు మూజువాణి ఓటు అంటే తొండి అంటున్నారు,మూజువాణి ఓటు అంటే సవాలు చేయని, వ్యతిరేకం చేయని అని అర్థం.దేశంలో 80% బిల్లులు మూజువాణి ఓటుతోనే పాసయ్యాయి,రాజకీయాల కోసం రాష్ట్రాన్ని విభజించకూడదు.తీర్మానం తెల్ల కాగితం అనే వాళ్లకు ఎందుకు అంత వణుకు, అసెంబ్లీ తీర్మానం తో పనిలేదు అనే అన్న వారు ఎందుకు బిల్లు వీగిపోయిన కొద్ది సేపటికే మా జనరల్ సెక్రటరీ మరియు కెసిఆర్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి KIRAN-KUMAR-REDDY1నేను ఇచ్చిన తీర్మానమే బ్రహ్మాస్త్రం. పులిచింతల సభలోనే బిల్లును ఓడించి బిల్లును ఓడించి పంపుతాను అని చెప్పను అని,చెప్పింది చేసి చూపించాను అని చెప్పారు.రాష్ట్రపతి పంపిన బిల్లులో కారణాలు,ప్రయోజనాలు మరియు ఆర్ధిక అంశాలు లేవు.రాష్ట్ర భవిష్యత్ కోసమే ఈ నిర్ణయం, అంతే కాని డ్రామాలు కాదు. రాష్ట్రపతి సంతృప్తి చెందాకే బిల్లును పార్లమెంటుకు పంపాల్సి ఉంటుంది. ఈనెల 4 లేదా 5న రాష్ట్రపతిని కలుస్తాను అని CM అన్నారు.

బిల్లులో లోపాలు ఉన్నప్పుడు అభిప్రాయాలు ఎలా చెప్పాలి. మేము చెప్పిన అంశాలకు ఎంత మద్దతు ఉందొ భవిష్యత్ లో తెలుస్తుంది. విభజన వల్ల రెండు ప్రాంతాల్లో ఇబ్బందులు వస్తాయని ముందే చెప్పా.ఇది డ్రాఫ్ట్ బిల్లు అని హోం శాఖ చెప్పింది. రాష్ట్రానికి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని హోం శాఖ చెప్పింది. పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లునే అసెంబ్లీకి పంపించి అభిప్రాయాలు కోరాలి.స్పష్టమైన అభిప్రాయం లేని వారు అసెంబ్లీలో మాట్లాడకుండా తప్పించుకున్నారు. రాష్ట్ర భవిష్యత్ తెలుగు ప్రజల చేతుల్లోనే ఉండాలి అని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Leave a comment