How to lose weight fast but easily (సులభంగా బరువు తగ్గడం ఎలా)

ధిరువు ఉన్న ప్రతీ ఒక్కరు సహజంగా సులభంగా బరువు తగ్గడం ఎలా అని అన్వేషిస్తారు. రోజూ ఉదయం లేవగానే ఈ రోజూ నుండి అయినా బరువు తగ్గే నియమాలు పాటించాలని చాలా కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటారు అధిక బరువు ఉన్న వారు. ఇలా తీసుకున్న నిర్ణయానికి ఎంత మంది కట్టుబడి ఉంటారు అంటే ప్రశ్నార్ధకమే. కొందరు కొన్ని గంటలు, కొందరు కొన్ని రోజులు మాత్రమే పాటిస్తారు. ఉదయం లేవగానే ఒక బలమైన క్షణంలో నిర్ణయం తీసుకోవడం బలహీనమైన క్షణంలో వదిలివేయడం సర్వసాదారణం అయింది. ఎందుకు వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండరో వారికి తెలుసు అయిన పాటించడం కష్టంగా ఉంటుంది.
  కష్టపడకుండా డైటింగ్ చేయకుండా బరువు తగ్గించుకునే సాధనాలు ఏమైనా ఉన్నాయో చూద్దాం.
సహజమైన పద్దతిలో శాశ్వతంగా బరువు తగ్గడం చాలా సాదారణ మరియు సమర్దవంతమైన మార్గం. దీనికోసం డైటింగ్ చేయాల్సిన పని లేదు. తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం అంతకంటే లేదు. మన ఆహారపు అలవాట్లు కొంత వరకు సర్దుబాటు చేసుకుంటే అనుకున్న పలితం త్వరితంగా సాదించవచ్చు.
ఒకసారి బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాక దానికి కట్టుబడి ఉండాలి, అలా అని కష్టమైన లక్ష్యాలను నిర్దేషించుకోవద్దు.ఆహారపు అలవాట్ల దగ్గర నిజాయితిగా ఉండాలి,మీరు తినే ఆహరం మీద ఒక కంట్రోల్ ఉండాలి.
అల్పాహారం తీసుకోవడం మానేసి దానికి బదులు ప్రోటీన్లు ఉన్న grains తీసుకోవడం మంచిది. మనం తినే ఆహరంలో పీచు(fiber) ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.ఎక్కువగా ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వలన తక్కువ తిన్నా ఎక్కువ తిన్నామన్న అనుభూతి కలుగుతుంది,ముఖ్యంగా లంచ్ లో తీసుకుంటే మంచిది.
ఫైబర్ ఎక్కువగా ఉండే కొన్ని ఆహార పదార్థాలు: Cauliflower,Cabbage,Berries,Leafy Greens,Beans,Oranges,Mushrooms,Mangoes,Apples,Corns,
Brown Rice,Wheat Bread,Almonds,Barley,Guava.
డిన్నర్ కి white rice బదులు brown రైస్ తీసుకుంటే ఇంకా మంచిది.Brown రైస్ తీసుకుంటే త్వరగా కడుపునిండడమే కాక ఇది మీ జీర్ణ వ్యవస్థని తీసివేస్తుంది.2 కప్పుల రైస్ ఒక కప్పు బ్రౌన్ రైస్ కి సమానం.
రెస్టారంట్ కి వెళ్ళడం తగ్గించాలి,నెలలో పదిసార్లు వెళ్ళే వారు రెండుసార్లే వెళ్ళండి.పుర్తిగా మానేస్తే ఇంకా మంచిది.
ఫాస్ట్ ఫుడ్ జోలికి వెళ్లకుంటే ఇంకా మంచిది. అలాగే స్వీట్స్,చాక్లెట్స్,బేకారి ఫుడ్స్ వంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండాలి.
స్నాక్స్,కూల్ డ్రింక్స్,ఫ్రూట్ జ్యూస్ ఎక్కువగా తీసుకోవడం వలన బరువు తెలియకుండానే పెరిగి పోతుంది,ఎందుకంటే వీటిలో కాలరీస్ ఎక్కువగా ఉంటాయి.వీటికి బదులు వాటర్ వీలైనంత ఎక్కువ మొత్తంలో తీసుకుంటే మంచిది. మంచి నీటిలో zero calories ఉండడమే కాకుండా జీవక్రియను పెంపొందిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి గ్రీన్ టీ అధ్బుతంగా పని చేస్తుంది. ఇందులో కూడా zero calories ఉంటాయి. గ్రీన్ టీ ఒక మంచి వరం బరువు తగ్గాలనుకునే వారికి. Exercise చేస్తే బరువు తగ్గోచు చాలా వరకు. కాని అందరికి వీలు కాదు చేయడం. Exercise చేయడం వలన ఎన్ని Calories కరిగిపోతాయో అంతే మొత్తంలో బరువు తగ్గొచ్చు. ఎప్పుడు వీలైతే అప్పుడు చిన్న చిన్న exercise చేయాలి.TV చూస్తూ చేయవచ్చు ,కొంచెం సమయం దొరికిన శరీరానికి పని చెప్పడం చెయాలి.
స్మోకింగ్ అలవాటు ఉంటే మానేయడం ఉత్తమం.
చిన్న పనికి కూడా నడిచి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి.
రుచిగా ఉన్నాయని ఏవి కూడా అతిగా తినడం చేయకూడదు.
ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో TV చూస్తూ భోజనం చేయకూడదు,ఇలా చేయడం వలన మన శ్రద్ధ అంత TV మీదనే ఉంటుంది,ఎంత తింటున్నామో కూడా తెలియదు,కిచెన్ రూంలో తింటే ఇంకా మంచిది.
వీలైనంత వరకు సాయంకాలం 7 లోపు డిన్నర్ చేయడం అలవాటు చెసుకోవాలి.
మీకున్న పెంపుడు కుక్కతో రోజు సాయంత్రం ఒక 15 నిమిషాల పాటు వాక్ కి వెల్లాలి.
రాత్రిళ్ళు ఎక్కువ సేపు మేల్కొనవద్దు.
అన్నింటికీ మించి బరువు తగ్గడానికి మంచి సాధనం రోజు కొంత సేపు యోగ చేయడం.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s